కుటుంబాలకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం

*"పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్" ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గము గూడూరు  మండలంలోని చెన్నూరు గ్రామ  పరిధిలోగల గిరిజన కాలనీలో మరియు తుంగపాలెం గిరిజన కాలనీ లో   1000 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం .*



      ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) భారినపడి భారతదేశం మరియు ఆంధ్రరాష్ట్ర ప్రజలు లాక్ డౌన్ నేపథ్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు  వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు "పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్" ఫౌండర్ మరియు   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు మరియు ట్రస్టు వాలంటీర్స్ గూడూరు నియోజకవర్గము గూడూరు  మండలం చెన్నూరు గ్రామ   పంచాయతీలలోని బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 1000కుటుంబాలకు తమవంతు సహాయ కార్యక్రమాలలో భాగంగా  కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది 


     దాదాపుగా 1000 కుటుంబాలకు పైగా ఇవ్వడం జరుగుతుందని పేర్నాటి ట్రస్ట్ నిర్వాహకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి  చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో *****మూలి కిషోర్ రెడ్డి*కందలి మురళి రెడ్డి, నీలం సుబ్బరామి రెడ్డి, సందీప్ రెడ్డి, రాజా, నాగార్జున, మాధవ రావు, ప్రశాంత్ మరియి   పంచాయతీ సెక్రటరీ అల్లి బాషా, V R O చంద్ర శేఖర్ మరియి వాలంటీర్ సిబ్బంది పాల్గొన్నారు***